గవర్నర్ తమిళ సైతో... సిఎం కెసిఆర్ భేటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

గవర్నర్ తమిళ సైతో... సిఎం కెసిఆర్ భేటీ


హైదరాబాద్, ఆగస్టు 29(శుభ తెలంగాణ): గవర్నర్ తమిళి సైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అసెం బ్లీ సమావేశాలు, కరోనాపై కేసీఆర్ చర్చించినట్లు సమాచా రం. తమిళిసై బాబాయి, కన్యా కుమారి ఎంపి మృతి చెందడం తో కేసీఆర్ పరామర్శించారు. సెప్టెంబర్ 7నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వ హించాలని కేసీఆర్ నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులను కేసీ ఆర్ కోరారు. అసెంబ్లీ సమా వేశాల్లో పలు బిల్లులు, తీర్మానా లు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం కావాలని కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యు లను సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళి సైతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ సమావేశాలు, కరోనాతో పాటు పలు విషయాల పై గవర్నర్ తో సీఎం చర్చించారు. అనంతరం తమిళిసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్ పరామర్శించారు. కాగా.. తమిళనాడు కన్యాకుమారి లోకసభ సభ్యుడు వసంతకుమార్ కన్నుమూసిన విషయం విదితమే. 70 సంవత్సరాల వసంత కుమార్ కరోనాతో చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆగస్ట్ 10న చేరారు. ఆయన్ను కాపాడేం దుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ గవర్నర్ తమిళ సైకు స్వయానా బాబాయ్ అవుతారు. వసంత్ మరణంతో తమిళసై ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.