వరద భాదితులకు భోజన సదుపాయం.. ఏర్పాటు చేసిన సెక్రటరీ నిర్మల - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 23, 2020

వరద భాదితులకు భోజన సదుపాయం.. ఏర్పాటు చేసిన సెక్రటరీ నిర్మల


గోదావరి వరద ముంపుకు గురైన భాదితులకు మార్కెట్ యార్డ్ సెక్రటరీ పొలిపాక నిర్మల బోజన సదుపాయం ఏర్పాటు చేసారు. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు గోదావరి ముంపుకు గురువడంతో బాధితులను బూర్గంపాడు లోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పునరావాస కేద్రంలో వున్నారు. వారందరికి శనివారం మార్కెట్ యార్డ్ సెక్రటరీ పొలిపాక నిర్మల ఆమె కుమార్తె శలాక ముల్లర్, స్థానిక సర్పంచ్ సిరిపురం స్వప్న ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. గత వారం రోజుల నుండి పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వరద భాదితులకు, అధికారుల తో పాటు దాతలు కూడా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య క్రమంలో ఎంఆర్ కిషోర్, అల్టి అక్బర్, విఆర్రీ వెంకటేశ్వరి, ఉప సర్పంచ్ సాయి ప్రత్యూష, మార్కెట్ కమిటీ సిబ్బంది, యూత్ నాయకులు భజన సతీష్, శనగ కిషోర్, భజన ప్రసాద్, అనిల్ పాల్గొన్నారు.

Post Top Ad