కీ.శే కెయం పాండు సేవలు చిరస్మరణీయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 18, 2020

కీ.శే కెయం పాండు సేవలు చిరస్మరణీయం..


కుత్బుల్లాపూర్ 17 ఆగస్టు (శుభ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు స్వర్గీయ శ్రీ కెఎం పాండు 75వ జయంతి సందర్భంగా చింతల్ లోని కెఎం పాండు మార్గ్ వద్ద ఉన్న భాపు విగ్రహానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కెఎం ప్రతాప్, కార్పొరేటర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూరకు వారు చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్,మంత్రి సత్య నారాయణ, డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరిష్, పుప్పాల భాస్కర్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కిషన్ రావు, రవీందర్ ముదిరాజ్, పెద్ది మల్లేష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.