నల్లపోచమ్మ విగ్రహం ఎక్కడ? - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 12, 2020

నల్లపోచమ్మ విగ్రహం ఎక్కడ?


తెలంగాణ పాత సెక్రటేరియట్ కూల్చివేత తర్వాత అక్కడ ధ్వంసమైన ఆలయంలోని పురాతన నల్ల పోచమ్మ విగ్రహం ఎక్కడ ఉందన్న అనుమానాలు బయలుదేరాయి. విగ్రహానిక ఇనిత్యపూజలు జర గా ఉన్నందున దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజంగానే ఆలయ పూజారితోసహా ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న లు ఉదయిస్తున్నాయి. రోజూ విగ్రహానికి నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? లేదా అని ఆరా అనుమానిస్తున్నారు. అలా చేయకపోతే అరిష్టమని పండితులు అంటున్నారు. కొత్త సెక్ర టేరియట్ నిర్మాణంలో భాగంగా పాత సచివాల యాన్ని నేలమట్టం చేశారు. అదే సమయంలో నల్లపోచమ్మ గుడిని కూల్చేశారు. సచివా లయ భవనాలు కూల్చే స్తుండగా శిథిలాలు పడడంవల్ల పోచమ్మ గుడి దెబ్బతిందని.. అందుకే కూల్చాల్సి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గుడిని కూల్చే ముందు సరైన పూజాది కార్యక్రమాలు నిర్వ హించి విగ్రహాన్ని కదిలించాలి. కూల్చివేత సమయంలో ఆలయంలో ప్రతిరోజూ పూజలు నిర్వహించే పూజారులకు తెలియకుండా గజ్వేల్ కు చెందిన పూజారులతో పూజలు చేయించి విగ్రహాన్ని కదిలించి మరోచోటికి తరలించారు. ఆ విగ్రహాన్ని కదిలించే ముందు సరైన పూజాది కార్యక్రమాలు నిర్వహించారో... లేదో.. ఆ విగ్రహం ఎక్కడుందో తెలియదని నల్లపోచమ్మ ఆలయ పూజారులు అంటున్నారు. దీనికి సంబంధించి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ లు వేసినా.. తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... దీంతో.. యుద్ధప్రాతిపదికన పాత సచివాలయ భవనాల కూల్చి వేత పనులు చేపట్టాక సోమవారంతో పూర్తయ్యాయి. సచివాలయం లో ఉన్న మొత్తం 11 బ్లాల కూల్చివేతల్లో భాగంగా సోమవారం చివరగా ఎల్ బ్లాక్ ను కూల్చివేశారు. ఇక, శిథిలాల తొలగింపు పక్రియ కొనసాగుతోంది... శిథిలాల నుండి ఇనుము, కంకర, అల్యూమినియం, ఇతర సామాగ్రిని వేరే చేస్తున్నారు. వ్యర్ధాల తొలగింపుకు మరో నెల రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన కొత్త డిజైన్లకు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాణం కోసం 400 కోట్లు పాలనానుమతులను కూడా ఇచ్చేశారు.