చేనేత కార్మికులను ఆదుకోండి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

చేనేత కార్మికులను ఆదుకోండి


హైదరాబాద్, ఆగస్ట్ 26(శుభ తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ లో చేనేతచీరెలు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందరను అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పనిలేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, చేనేత పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని దవాఖానలో వాడుతున్న వివిధ వస్త్ర ఉత్పత్తులను (బెడ్ షీట్, పిల్లో కవర్, ఆఫ్రాన్స్, మాలు, కర్టెన్) నేరుగా చేనేత సహకార సంఘాల నుంచి, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసి జీవన భృతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవిం చిన మహిళలకు ఇస్తున్న కేసీఆర్ కిట్ లో పాలిస్టర్ చీరెకు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కాటన్ చేనేత చీరెలు ఇచ్చేలా చూడాలని కోరారు. దీంతో చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని దొరికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఈటల సాధ్యమైనంత త్వరలోనే విధి విధానాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని వైద్య కార్యదర్శికి లేఖను పంపారు. చేనేత కారి అందిస్తానని భరోసా కల్పించారు