రామలింగారెడికి కెసిఆర్ నివాళి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 07, 2020

రామలింగారెడికి కెసిఆర్ నివాళి


సిద్దిపేట, ఆగస్టు 06(శుభ తెలంగాణ); జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకొని ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయాని కి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే సోలిపేట తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సీఎం కన్నీటి పర్యంతమైయ్యారు. సోలిపేట కుటుంబ సభ్యులను ఓదార్చా రు. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నా రు. రామలింగారెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం కానుండగా సిఎం అక్కడికి వచ్చారు. సిఎం రాకతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మంత్రి హరీ ష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అక్కడే ఉ న్నారు. ఆప్త మిత్రుడిని కోల్పో యానంటూ కెసిఆర్ భావోద్వే గానికి లోనయ్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేం దర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నా రు. ఉదయం, వార్త పత్రికల్లో పని చేసిన జర్నలిస్టులు, రాష్ట్ర ప్రతినిధులు విరహథ్ అతలీ ఎమ్మెల్యే భౌతికకాయాన్ని సంద ర్శించారు. తమ మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉ ందంటూ వారి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.