అంగన్ వాడి కేంద్రంలో.. తల్లిపాల వారోత్సవాలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

అంగన్ వాడి కేంద్రంలో.. తల్లిపాల వారోత్సవాలు..


తల్లిపాల వారోత్సవాలు దుండిగల్ మున్సిపాలిటీలోని ఔరం పేట్ 1, 2, అంగన్ వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమం లో భాగంగా కౌన్సిలర్ పిసరి బాలమణి కృష్ణారెడ్డి చేతులమీదుగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు టీ, హెచ్, ఆర్, గుడ్లు, పాలు, బియ్యం, మంచి నూనె, పప్పు, పంపిణీ చేయడం జరిగింది. మరియు తల్లిపాలు బిడ్డ పుట్టిన తర్వాత ఒక గంటలోపు తల్లికి పాలు వస్తాయి వాటిని ముర్రుపాలు అంటారు. అవి లేత పసుపు రంగు లో ఉంటాయి తల్లి పాలు పట్టడం వలన పిల్లలు రోగనిరోధక శక్తి ని పెంచుతాయి. ప్రతి తల్లి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ డీ లలిత బాయి, కే. లక్ష్మీబాయి, గర్భిణీ స్త్రీలు బాలింతలు ఏడబ్ల్యు హెచ్ అనిత, లక్ష్మి పాల్గొన్నారు.