వరద బాధితులకు జిల్లా కలెక్టర్.. సేవలు మరువలేనివి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

వరద బాధితులకు జిల్లా కలెక్టర్.. సేవలు మరువలేనివి


ఆగస్టు 25. (శుభ తెలంగాణ) భద్రాచలం వరద ప్రాంతాలలో పర్యటిం చి, ప్రత్యేకంగా పర్యవేక్షించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం వి రెడ్డి వరద బాధితులకు, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిపిపిఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో, పంపు గ్రామాలలో, అనేక కాలనీలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారందరిని వరద సహాయ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్ డా.యం.వీ.రెడ్డి యుద్ధ ప్రాతిపదికన తగు ఏర్పాటు చేయడం అభినంద నీయమన్నారు. పునరావాస కేంద్రాలలో తల దాచుకుంటున్న నిర్వాసితు లందరికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, పర్యవేక్షిస్తూ నిరాశ్రయులైన వారందరికీ అల్పాహారం తో పాటుగా రెండు పూటలా ఉచిత భోజనాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారున్నారు. ప్రజలకు సకాలంలో తగు సేవలు అందించిన జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి, భద్రాచలం ప్రత్యేక అధికారిణీ వేల్పుల విజేత కూడా అంకితభావంతో పనిచేస్తూ, అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలను సమన్వయం చేస్తూ, అనుకోకుండా వచ్చిన ఈ వరదల లో ముంపుకు గురైన భద్రాచలం పట్టణ ప్రజలను జిల్లా యంత్రాంగం, భద్రాచలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు వరద బాధితులకు సేవ చేయడం అభినందనీయమన్నారు. భద్రాచలం పట్టణం, గోదావరి పరివాహక పరిసర ప్రాంతాల్లో ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకంగా రూపకల్పన చెయ్యాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లకు లేఖ రాయడం జరిగిందని, వరదముంపు నివారణకోసం కరకట్టలు నిర్మించి దక్షిణ భారతావని లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సీతారామచంద్ర దివ్యక్షేత్రాన్ని కాపాడాలని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి కోరుతుందని ఆయన తెలిపారు.

Post Top Ad