పంట నష్ట వివరాలను నమోదు చేయండి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

పంట నష్ట వివరాలను నమోదు చేయండి


చర్ల. ఆగస్టు 25 (శుభ తెలంగాణ) : గత కొద్ది రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారుల నేతృత్వంలో మంగళవారం నుండి శుక్రవారం వరకు నాలుగు రోజులు పాటు పంచాయితీల వారీగా సర్వే చేయనున్నట్టు మండల వ్యవసాయాధికారి శివకుమార్ తెలిపారు.పంట నష్టం వివరా లు సేకరించేందుకు వచ్చిన అధికారులకు రైతులు సహకరిం చాలని అన్నారు. పంట వివరాలు నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళ వారం జెట్టిగుడెం, పెద్దపల్లి, కొత్తగూడెం, తేగడ, చిన్న మిడిసిలేరు, జంగా లపల్లి, ధండుపేట, కొత్త పెళ్లి, గ్రామాలలో సర్వే నిర్వహించి, నష్టపోయిన 95 మంది రైతులకు చెందిన 123.53 ఏకరాల వరి, 9 మంది రైతులకు చెందిన 9.1 ఎకరాల పత్తి పంటల వివరాలను సేకరించిపై అదికారుల కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు మౌనిక, కీర్తి, పృధ్వీరాజ్, వీఆర్వో, పి ఆర్ ఏ లు, రైతులు పాల్గొన్నారు.