ఐటిఐ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

ఐటిఐ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్..


మణుగూరు ఆగస్టు 26 (శుభ తెలంగాణ): ఐటిఐ కోర్సులలో ప్రవేశానికి ఉపాది శిక్షణ శాఖ సంచాలకులు కే.వై నాయాక్ నోటిఫికేషన్ జారిచేసి నట్టు బుధవారం మణుగూరు ప్రభుత్వ ఐబీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నేషన ల్ కౌన్సిల్ ఫర్ ఓకేషనల్ ట్రైనింగ్ ( ఎన్.సి.వి.టీ)లోని కోర్సులకు అసక్తి అర్హత గల విద్యార్ధిని, విద్యార్థులు ఈ కింద తెలిపిన వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. విద్య అర్హతలు 10పాసైన వారు, 01.08.2020 నాటికీ 14 సంవత్సరాలు నిండి ఆపై వయస్సు ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అవకాశం ఉందని తెలిపారు. 8వ తరగతి పాసైన వారికీ కొన్ని కోర్సుల కు మాత్రమే అర్హులని వివరాలు వెబ్ సైట్ లో ఉంటాయని తెలియ జేశారు. దరఖాస్తు చేసుకోవడానికి 25, 08, 2020నుండి 07.09.2020 వరకు అవకాశం కలదని అన్నారు. వివరాలు https://iti.telangana. gov.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు.