గుంతల మయంగా మారిన రోడ్లు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 12, 2020

గుంతల మయంగా మారిన రోడ్లు..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ): అమీన్పూర్ మండలం బీరంగుడా రోడ్డు అనగా జాతీయ రహదారి నుండి బీరంగుడా మీదుగా కిష్టారెడ్డి పేట వెళ్లే రోడ్డు గుంతల మయంగా ఎన్నో సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉంది. కాల క్రమేణాగా వందల కాలనీలు వెలసి వేలాది మంది ఈ రోడ్డు పై నిత్యం ప్రయాణం సాగిస్తున్నా ఈ రోడ్డుకు మోక్షం కలగలేదు, ఎంతో మంది ప్రాణాలు బలితీసుకోగా మరికొంత మంది అంగవికలులైన సంఘటనలు ఇప్పటికీ పునరావృతం అవు తున్నాయి నిత్యం ఇటువంటి సంఘటనలు చూసి చలించి మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్ పదవీ బాధ్యతలు తీసుకున్న అనతి కాలం లోనే ఈ రోడ్డుపై ప్రమాదాలకు అడ్డ కట్టు వేయాలని 5 లక్షల సొంత నిధులతో కంకర మొరం వేసి గుంతలమయమైన రోడ్డును సాఫీగా చేయించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్ కాలప్ప ఎక్స్ ఎంపిటిసి అమీన్పూర్ మరియు అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఏనుగు కవిత శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.