మంచి నీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై.. అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 11, 2020

మంచి నీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై.. అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష..


కుత్బుల్లాపూర్ ఆగస్టు 10(శుభ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని మంచి నీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలు మరియు చేపట్టబోయే కొత్త లైన్లు, పునర్నిర్మాణ (రీ మోడలింగ్) పనులపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాటర్ వర్క్స్ సిజిఎం అనిల్ కుమార్ అధికారులతో పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాల యం నుండి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో మంచి నీటి సమస్య లేకుండా అధికారులు పని చేయాలని అన్నారు. జీహెచ్ఎంసి పరిధిలో కొత్త పైపు లైన్లు, పునర్నిర్మాణ పనులకు మంజూరైన రూ. 3 కోట్ల నిధులకు మరో కోటి రూపాయలు కేటాయించి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. వర్షాకాలం రావడంతో ముంపు ప్రాంతా లను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య ఏర్పడిన వెంటనే అధికారులు స్పందించాలన్నారు. మరే ఇతర సమస్య లున్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.