రైతు నర్సింహులు కుటుంబాన్ని.. ప్రభుత్వం ఆదుకోవాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

రైతు నర్సింహులు కుటుంబాన్ని.. ప్రభుత్వం ఆదుకోవాలి..


- నర్సింహులు ఆత్మహత్యకు కారకులైన
అధికారులను అధికారులను శిక్షించాలి.
- గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్

సిద్దిపేట జిల్లా (శుభ తెలంగాణ) : గజ్వేల్ నియోజక వర్గంలో వేలుర్ గ్రామంలో దళిత రైతు నర్సింహులు తన భూమి సమస్యకై అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన ప్రయోజనం లేకపోవడంతో చివరికి విసుగు చెంది యువ రైతు నర్సింహులు సెల్ఫీ తీసుకొని ఆత్మ హత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా టీ జి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ మాట్లాడుతూ.. నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన అధికారులను, ప్రజా ప్రతినిధుల ను వెంటనే కరినంగా శిక్షించాలి. నర్సింహులు కుటుంబాన్ని స్వయం గా రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించాలి. అంతే కాకుండా నర్సిం హులు కుటుంబానికి కోటి రూపాయల ఎక్రేషియా కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వారి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ తో పాటు ఇంట్లో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని టీజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దొడ్ల వెంకట్ డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో చైర్మన్ కే. వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేశ్ ఉపాధ్యక్షులు కొల్కుర్ ప్రతాప్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.