పెండింగ్ కేసుల పరిష్కారంలో.. ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

పెండింగ్ కేసుల పరిష్కారంలో.. ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి


రాజన్న సిరిసిల్ల జిల్లా 26 ఆగస్టు(శుభ తెలంగాణ) సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో డిజిపితో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఏస్పి రాహుల్ హేగ్గే పాల్గొ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా బుధవారం జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక జిల్లాలలో పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. కోర్టు కేసులలో శిక్షల శాతం పెరిగేలా, నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన నల్లగొండ, ఎస్పీలను, సైబరాబాద్, రాచకొండ, రామగుండం కమిషనర్లను డిజిపి ప్రత్యేకం గా అభినందించడంతో పాటు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పని చేయాలన్నారు. సైబర్ నేరాల కేసులు పరిష్కారం కోసం అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. లాక్ డౌన్ వల్ల సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిపోయిందన్నారు. పోలీస్ అధికారులు సైబర్ నేరాలను తగ్గించడం కోసం అవసమైన సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ సిబ్బంది సంఖ్యను పెంచుతూ సైబర్ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెర్డే మాట్లాడుతూ జిల్లాలో పెండింగులోని కేసులను సైతం క్లియర్ చేసే విధంగా జిల్లా జడ్జితో సమీక్ష నిర్వహిస్తామని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పెండింగ్ కేసులు వివరాలు, డిఎస్పీ, సీఐలతో పెండింగ్ కేసులపై ఎప్పటికపుడు సమీక్షించడం ద్వారా పరిష్కరించబడిన కేసుల వివరాలు డిజిప్ వివరించారు. ఈ కేసుల సంఖ్యను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి.సి.ఆర్.బి సి.ఐ శ్రీలత,ఐ.టి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.