అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 21, 2020

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష..


కుత్బుల్లాపూర్ 20 ఆగస్టు (శుభ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి -పరిధిలోని కుత్బుల్లాపూర్- గాజు ల రామారం జంట సర్కిళ్ళల్లో పెండింగ్ లో ఉన్న వివిధ అభి వృద్ధి పనులపై గురువారం ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ జీహెచ్ఎం సీ అధికారులు, కార్పొరేటర్లతో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యా లయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎనిమిది జీ హెచ్ఎంసీ డివిజన్లు ఉండగా డివి జన్ల వారీగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే కార్పొరేటర్లు, అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, భూగర్భ డ్రైనేజీ మొదలగు అభివృద్ధి పనులు స కాలంలో పూర్తయ్యేలా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాల న్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అత్యవసరం గా చేయవలసిన పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ మమత, ఎస్సీ శంకర్ నాయక్, డిసిలు రవీందర్, మంగతాయారు, ఈఈలు కృష్ణ చైతన్య, మహేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, విజయ్ శేఖర్ గౌడ్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, యువ నాయకులు కేపి విశాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.