అయోధ్య ఆలయ నమూనాలు విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 05, 2020

అయోధ్య ఆలయ నమూనాలు విడుదల


అయోధ్యలో రామచుందిర నిర్మాణానికి సంబధించిన నమూనాలను అయోధ్య ట్రస్ట్ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండగా ఆలయ నమూనాను 161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పాకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన సమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ వెల్లడించారు. భారీ డోమ్ తో పాటు ఇంటీరియర్స్ను ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందని ఆర్కిటెక్ట్ చంద్రకాశ్ సోంపురసు 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్ కోసం సంప్రదించారు. ఆయన తండ్రి ప్రభా శంకర్ సొంపుర సోమ్ నాథ్ ఆలయ డిజైన్‌ను రూపొందించడంతో పాటు ఆలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్ధతిలో రామాలయ ఆర్కిటెక్చర్ కు తుదిరూపు ఇచ్చినట్టు సొంపుర (77) తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఇక బుధవారం జరిగే మందిర నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి సహా 200 మంది వరకూ ప్రముఖులు, రామమందిర ఉద్యమ నేతలు పాల్గొంటారు.