కరుణించిన వర్షం.. రైతన్న హర్షం... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

కరుణించిన వర్షం.. రైతన్న హర్షం...


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12 ఆగస్టు (శుభ తెలంగాణ): చర్ల మండల వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, చెరువులు కుంటలు జల సిరులను సంతరించు కున్నాయి. ఎగువ ప్రాంతంలో సైతం భారీ వర్షాలు కురుస్తుండడంతో చెక్ డ్యామ్ లు, ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుకుంటోంది. మందల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. మండలంలో దాదాపు 3000వేల ఎకరాల పంటసాగులు వర్ష భావంపైనే ఆధారపడి పండు తోంది. ఇప్పటికే సగానికి పైగా వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న అన్నదాతలు మిగిలిన సాగు పనులను సైతం ముమ్మరం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. - నిండు కుండల తాలిపేరు ప్రాజెక్టు.. భారీ వర్షాలతో మండల పరిధిలోని తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టు నిండు కుండల దర్శనం ఇస్తోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2000 ఎక రాలు వరిసాగు పంట తాలిపేరు ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటాయి. గడిచిన ఏడాది స్వల్ప లాభాలు అందుకున్న ఆయా కట్టు రైతులు ఈ యడాది వర్షపాతం అధికంగా నమోదై... అధిక దిగుబడులకై ఎదురు చూస్తున్నారు..