మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ.. జూనియర్ కళాశాల అందుబాటులోకి... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 22, 2020

మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ.. జూనియర్ కళాశాల అందుబాటులోకి...


కుత్బుల్లాపూర్ 21 ఆగస్టు (శుభ తెలంగాణ) :కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని బహదూర్ పల్లిలో రూ.2.50 కోట్లతో నూతనంగా చేపడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాలవంతమైన తరగతి గదులు, ఆటస్థలం మొదలగు మౌలిక సదుపాయాలతో మరి కొద్దిరోజుల్లోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. జూనియర్ కాలేజి పూర్తితో విద్యార్థులెవరూ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ప్రైవేటుకు ధీటు గా మంచి విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తిరుపతి, వెలుగు నారాయణ రావు పాల్గొన్నారు.

Post Top Ad