మేడ్చల్ జిల్లా కార్యవర్గాన్ని, బ్లాక్ కాంగ్రెస్, డివిజన్ అధ్యక్షుల ప్రకటన - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 20, 2020

మేడ్చల్ జిల్లా కార్యవర్గాన్ని, బ్లాక్ కాంగ్రెస్, డివిజన్ అధ్యక్షుల ప్రకటన


కుత్బుల్లాపూర్ ఆగస్టు 19 (శుభ తెలంగాణ) : మేడ్చల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను గతంలో రద్దు చేసిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలంగౌడ్ కొత్తగా మేడ్చల్ జిల్లా స్థాయి కార్యవర్గం కమిటీ మరియు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజ్లరి బ్లాక్ కాంగ్రెస్, డివిజన్ కమిటీలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతితో కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే మల్కాజిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు నూతన కమిటీ ఎంతో దోహదపడుతుందని అలాగే పార్టీలో కష్టపడే ప్రతి వ్యక్తికి గుర్తింపు ఉంటుందని కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సహకారంతో అత్యధిక డివిజన్లు గెలిపిం చాలని కొత్తగా ఎంపికైన జిల్లా కార్యవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్లరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నందిగంటి శ్రీధర్ పాల్గొన్నారు.

Post Top Ad