కొండ పోచమ్మ సాగర్ లో.. చేపలను వదిలిన మంత్రులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

కొండ పోచమ్మ సాగర్ లో.. చేపలను వదిలిన మంత్రులు..


గజ్వేల్ 25 ఆగస్టు (శుభ తెలంగాణ) : మార్కుకు మండలానికి చెందిన కొండపోచమ్మ సాగర్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరియు పశుసంవర్ధక శాఖమంత్రి టీ శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను వదిలి పెట్టడం జరిగింది. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి బీడు భూముల ను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుం ది అని చెప్పారు. దీనిద్వారా బెస్తవారికి,ముదిరాజు సోదరులకు జీవనోపాధి దొరుకుతుంది అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మిస్తామని కలలో కూడా అనుకోలేదని ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి వల్ల ఇది సాధ్య పడింది అని మంత్రులు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి చేస్తారని అన్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్ రెడీ, స్థానిక ప్రజా ప్రతినిధులు తెరాస సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.