దుబ్బాక నియోజకవర్గానికి రెండు పడకల ఇల్లు మంజూరు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

దుబ్బాక నియోజకవర్గానికి రెండు పడకల ఇల్లు మంజూరు


సిద్దిపేట జిల్లా 29 ఆగస్టు (శుభ తెలంగాణా) : దుబ్బాక నియోజక వర్గానికి మూడు వేల రెండు పడకల ఇండ్లు మంజూరు అయ్యాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 800 ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందనీ మిగిలిన చిన్న చిన్న పనులను 15రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారు లను ఆదేశించారు అతి త్వరలో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇల్లు పంపిణీ చేస్తాం అని అన్నారు. దుబ్బాక నియోజక వర్గానికి ముఖ్యమంత్రి గారు 10కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు , పట్టణంలో నాలుగు కోట్లతో సమీకృత మార్కెట్ మరియు 20వ వార్డు లో మురుగు కాలువలు సిసి రోడ్లు నిర్మాణం చేపడతా మన్నారు పట్టణం లో కోటి రూపాయలతో గ్రంథాలయ నిర్మాణం. ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేపట్టిన అన్ని అభివృద్ధికార్యక్రమాలు పూర్తి చేస్తామ న్నారు. దుబ్బాక నియోజక వర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 500 చెరువులను నింపడం ద్వారా 1లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని అన్నారు. ప్యాకేజీ 12 ద్వారా తోగుట నుంచి దుబ్బాక వచ్చేకాలువ కుడి ప్రధాన కాలువ ప్యాకేజీ 13మల్లన్నసాగర్ కొండ పోచమ్మ ప్రధాన కాలువ రామాయంపేట కెనాల్ ఉప్పరపల్లి కెనాల్, కిష్టాపూర్ కెనాల్, శంకరం పేట కెనాల్ ల దుబ్బాక నియోజకవర్గంలో ద్వారా 500 చెరువులు నిండనుందని చెప్పారు.