కాంగ్రెస్‌లో భగ్గుమన్న గ్రూపు విభేదాలు.. కర్రలతో కొట్టుకొన్న నేతలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 10, 2020

కాంగ్రెస్‌లో భగ్గుమన్న గ్రూపు విభేదాలు.. కర్రలతో కొట్టుకొన్న నేతలు


వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎప్పటినుంచో ఉన్న విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లాకు చెందిన పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాక పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు. ఆదివారం వరంగల్ పట్టణంలోని హన్మకొండ కాంగ్రెస్‌ భవన్‌ ముందు యువజన కాంగ్రెస్ నేతలు కర్రలతో కొట్టుకున్న ఘటన జరిగింది. ఆవరణలోనే ఉన్న ఇతర నేతలు కొట్టుకుంటున్న వారిని ఆపే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈ ఘర్షణలో అక్కడే పార్కింగ్ చేసిన ఓ కారు కూడ ధ్వంసమైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పట్టణ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు వర్గాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు ఏ విషయం దగ్గర ఘర్షణ పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. గొడవకు గల కారణాలను పార్టీ నాయకత్వం ఇరు వర్గాల నుంచి సేకరించినట్టుగా సమాచారం.