ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం..


కుత్బుల్లాపూర్ ఆగస్టు 24(శుభ తెలంగాణ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధి లోని కుత్బుల్లాపూర్- గాజుల రామారం జంట సర్కిళ్ళల్లో పెండింగ్ లో ఉన్న వాటర్ వర్క్స్ పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ పనులపై సోమవారం ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు, కార్పొరేటర్లతో పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని ఎనిమిది జీహెచ్ఎంసీ డివిజన్లలో పెండింగ్ లో ఉన్న మంచి నీటి సరఫరా పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ పనుల వివరాలను ఎమ్మెల్యే కార్పొరేటర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమున్న చోట కొత్త లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులు సకాలంలో పూర్తయ్యేలా వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమన్వయంతో ఉ ంటూ సమస్యల పరిష్కారానికి అధికారులంతా కృషి చేయాలన్నారు. నిధులు మంజూరై పెండింగ్ లో ఉ న్న పైపు లైన్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ సిజిఎం అనిల్ కుమార్, డిజీఎంలు అప్పల నాయుడు, ఉమాశంకర్, మేనేజర్లు రాజు, శివ, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Post Top Ad