సుభాష్ నగర్ డివిజన్లో అభివృద్ధి.. పనులు పరిశీలించిన ఎమ్మెల్యే.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 09, 2020

సుభాష్ నగర్ డివిజన్లో అభివృద్ధి.. పనులు పరిశీలించిన ఎమ్మెల్యే..


మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఆగస్టు 8 (శుభ తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగు తోందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. కుత్బుల్లా పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కోట్ల రూపాయల నిధులతో పెద్ద ఎత్తున జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డితో కలిసి రూ.28 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఉన్న సమస్యల పై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగా రావు, ఏరియా కమిటీ సభ్యుడు శేషు, నాయకురాలు పద్మజ రెడ్డి, లక్ష్మీ, నాయకులు ఇస్మాయిల్, కైసర్ పాశ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.