విద్యార్థులకు బుక్స్ పంపిణీ.... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

విద్యార్థులకు బుక్స్ పంపిణీ....


మణుగూరు ఆగస్టు 26 (శుభ తెలంగాణ): మండల పరిధిలోని వాగు మల్లారంలో గ్రేస్ బోర్డింగ్ స్కూల్ విద్యార్థులకు ఖమ్మం రూరల్ పరిధిలోని గా స్ఫెల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీస్ సొసైటీ (జిటిఎస్ఎస్ ఎస్) సంస్థ ఆధ్వర్యంలో 160 మంది విద్యార్థులకు బుక్స్, ఒక్కొక్కరికి జదు కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను బుధవారం ఎంపిడిఓ ఎస్కెషిలార్ సాహెబ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఎంపిడిఓ మాట్లాడుతూ విద్య వ్యక్తి జీవితానికి ఎంతో దోహద పడుతుందని, సమాజంలో వ్యక్తి విలువను పెంచేది విద్య మాత్రమేన న్నారు. గ్రేస్ విద్య సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో (జి.టి.ఎస్.ఎస్.ఎస్) ఇన్చార్జి ఆర్.వి.రామారావు, స్వామి, సురేష్, రాజేశ్వరి, సునీత, యుగంధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.