ప్రతీకాలనీ, బస్తీలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

ప్రతీకాలనీ, బస్తీలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం


కుత్బుల్లాపూర్ ఆగస్టు 25 (శుభ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూరారం కాలనీ స్మశాన వాటిక, సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని అలాగే ఈత ఒక సాధన పాఠ్యాంశంలో చేర్చి విద్యార్ధులకు బోధించాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకానంద్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ స్మశాన వాటిక,సిసి రోడ్లను మెరుగు పరుస్తామని అన్నారు. విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లి అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నారని కనుక ఈత సాధనను విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Post Top Ad