మట్టి వినాయక.. పూజలో మహత్యం! - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 22, 2020

మట్టి వినాయక.. పూజలో మహత్యం!


హైదరాబాద్ ప్రతినిధి, ఆగస్టు 21(శుభ తెలంగాణ): మన పండగలన్నీ ప్రకృతి ఆరాధనతో మమేకమై వుంటాయి. వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో స్వామిని పూజిస్తాం. విఘ్నాలను నివారించే వినాయకుని పూజతో మనం పండగను జరుపుకొంటాం. చెరువుల్లో మట్టిని తవ్వి తీసుకుని వచ్చి వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువలోనే పూజించిన పత్రీపూలతో నిమజ్జనం చేయడం వెనక శాస్త్రీయత ఉంది. మట్టిని తీసి మళ్లీ అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్యరహితంగా కావడానికి జరిగే ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంది. మంనం పూజించే మారేడు, ఉత్తరేణి వంటివి ఔషధ గుణాలు కలిగి ఉ ండడం వల్నీటిని కాలుష్యం నుంచి కాపాడుతాయి. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి. ఏటా కొన్ని వేల గణపతి విగ్రహాలను రంగులతో అలంకరించి మండపాల్లో ఏర్పాటుచేయడాన్ని చూస్తుంటాం. అలాగే ప్రతి ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ నిర్వహిస్తాం. వీటిని మట్టితో తయారుచేస్తేనే మన పర్యావరణం కాపాడకున్నవారం అవుతాం. ఇటీవల కొంతకాలంగా విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్యారిస్, రసాయనాలు కలిగిన రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినాయక నిమజ్జనంతో ఈ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారితో చెరువులు, కుంటలు, తటాకాలు, బావులు, నదులకు పర్యావరణ నష్టం జరుగుతోంది. ఈ జలాల్లో నివసించే అనేక జీవకోటి మనుగడకు విఘాతం ఏర్పడుతోంది. అలాగే నీరు కలుషితం అవుతోంది. దీంతో మల్లీ ఇది వాడడానికి వీలు లేకుం డా హైదారాబాద్ హుస్సేన్ సాగర్ లా కాలుష్య కాసారంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని పర్యా వరణ ప్రేమికులు కోరుతున్నా రు. మట్టి గణపతులను తయా రుచేయడం ద్వారా కొంతయి నా పర్యావరణం కాపాడుకోగ లం. ఇంట్లో పూజించే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పూర్తిగా మట్టితో తయారుచేస్తే అవి పర్యావరణహితంగా వుంటాయి. నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఎలాంటి రంగులను వాడకపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉ ండదు. ఇక వీధుల్లో ప్రతిష్టిం చే పెద్ద విగ్రహాల తయారీలోనూ మట్టినీ, పర్యావరణ హితమైన రంగుల్నీ వాడటం ద్వారా పర్యా వరణానికి మేలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇటు వంటి విగ్రహాల వల్ల నిమజ్జన సమయంలో జలాలు కలుషితం కావని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వినాయకచవితి ఉత్సవాలు సందర్భంగా స్వచ్ఛమైన ప్రకృతి కోసం కొన్ని జాగ్రత్తలు పాటించా ల్సి ఉంది. వినాయక మండపాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. పెద్ద పెద్ద మండపాల వద్ద భారీ పరిమాణం కలిగిన ఆడియో సిస్టమ్ ను పెట్టి శబ్ద కాలుష్యం కలిగించకుండా చూడా లి. పెద్ద పెద్ద చెరువులూ, తటాకా లూ, కుంటల్లో వినాయకుడి విగ్ర హాలను నిమజ్జనం చేసి పర్యావర ణానాన్ని దెబ్బతీయవద్దని సూచిస్తు న్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణా నికి మద్దతుగా నిలవా లన్నారు. ఏటా నిమజ్జనాల కారణంగా చెరువులు కాలుష్య కాసా రాలుగా మారుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. కాగా ఈ సారి కరోనా వైరస్ కారణంగా వినాయక నవరాత్రు లపై ప్రభుత్వం ఆంక్షల నేపథ్యం లో నవరాత్రుల సందడి కనుమ రుగు అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ బాద కాస్త తగ్గింది. కాలు ష్యం తగ్గింది. చిన్న చిన్న మట్టి వినాయ కులకే ప్రాధాన్యం ఏర్పడింది.

Post Top Ad