హాబీబా హత్య కేసును చేధించిన పోలీసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

హాబీబా హత్య కేసును చేధించిన పోలీసులు..


మణుగూరు: మణుగూరు పట్ట ణంలో అగస్టు 8వ తేదిన పట్ట పగలు జరిగిన ఎండి. హాబిబా బేగం (50) హత్య కేసును పోలీ సులు చేధించినట్లు ఎస్ హెవో షుకూర్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్లో విలేక రులతో మాట్లాడుతూ... హత్య అనంతరం ఇబ్రహీం తన కుటుం బంతో కర్ణాటక రాష్ట్రానికి పారి పోయ్యాడు. ఇబ్రహీం మణుగూరు కి చేరుకొని చింతల బయ్యారం వద్ద గోదావరి దాటి ఛత్తీస్ ఘడ్ వేళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా, పక్క ప్రణాళికతో నిందితున్ని పట్టుకోవడం జరిగిందన్నారు.కు టుంబ కలహాలు కారణంగా హాబీబాబేగంను ఇబ్రహీం హాత్య చేయడంజరిగిందన్నారు. ఇబ్రహీం తల్లి లాల్ బీ మృతి చెందడంతో ఫిక్స్ చేసుకున్న నగదు రూ.8 లక్షల రూపాయలు వచ్చాయి. వీరి కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు సమానంగా నగదు పంచుకుందామని నిర్ణయించు కున్నారు. కాని దానికి ఇబ్రహీం అంగీకరించలేదు. నగదులో సగం వాట నాకు కావాలని ఇబ్రహీం గొడవపడడం జరిగిందన్నారు. దీనికి అన్నదమ్ములు ఎవ్వరు అంగీకరించకపోవడంతో నామినిగా వున్న హాబిట్ బేగాన్ని, బావ అయిన ఇబ్రహీం చంపడాన్ని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎ నరేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.