ఆందోళనలో మన్యం సర్పంచులు... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

ఆందోళనలో మన్యం సర్పంచులు...


చర్ల ఆగస్టు 29(శుభ తెలంగాణ) : మన్యంలో పంచాయితీల పాల న కత్తిమీద సాములా మారిందని చర్ల మండల పరిధిలోని పంచా యితీల సర్పంచులు వాపోతు న్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు లో వుండటం, మావోయిస్ట్ ప్రభవితప్రాంత అవటం వల్ల పంచాయితీల పరిపాలనా వ్యహారాలతోపాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న సంఘటనల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రమాదం ఎటువైపు నుండి ముంచుకు వస్తుందో అని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. మండలానికి చెందిన ఇద్దరు సర్పంచులు మావోయిస్ట్ కొరియర్ లుగా పనిచేస్తున్నారని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటనలతో ఆందోళన చెందుతున్న మిగతా సర్పంచులు శనివారం స్థానిక ఎం.పి. డి. ఓ కార్యాలయంలో సమావేశం అయ్యారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో పంచాయితీల పాలన పారదర్శకంగా చేస్తున్నపపటికీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, చట్టానికి తామంతా బద్దులు గానే ఉంటున్నామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తాము దూరంగా ఉంటున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతున్నామని పోలీసు అధికారులు తమ బాధను అర్థం చేసుకోవాలని మనవి చేశారు. మన్యం ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులలో కూడా పారదర్శకంగా పాలన సాగిస్తున్న ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించకుండా ఉ ండేందుకు సహకరించాలని అధికారులను ఈ సందర్భంగా కోరారు.