డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి : సిపిఎం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 23, 2020

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి : సిపిఎం


మణుగూరు. 22 ఆగస్టు (శుభ తెలంగాణ): గత కొన్ని రోజులగా కురిసిన అకాల వర్షాలకు వాగులు పొంగి, వరదల వల్ల ఇండ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి కాటిబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం మండల బృందం కోడిపుంజుల వాగు , కూనవరం రైల్వే గేట్ , అరుంధతి నగర్ లో పర్యటన చేశారు. పల్లపు నాగేశ్వరరావు అనే కార్మికుడు రేకుల ఇల్లు వరదకు పూర్తిగా వంగిపొయిందని, అది ఎప్పుడైన కూలే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి ఇండ్లను గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. మండలంలో కూలిపోయే ప్రమాదం ఉ న్న ఇండ్లను తక్షణమే గుర్తించి ప్రాణహాని జరగ కుండా ప్రభుత్వం, అధికారులు చూసుకోవాలన్నారు. వరద ముంపునకు గురైన కాలనీలలో బ్లీచింగ్ చల్లాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య శిబిర కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బండిరాజేష్ , కొడిశాల రాములు, వెంకన్న, ఉప్పుతల నర్సింహారావు, యాంపాటి రంగయ్య , నర్సయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.

Post Top Ad