ప్రెస్ క్లబ్ జవహర్‌నగర్ ప్రారంభోత్సవం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 06, 2020

ప్రెస్ క్లబ్ జవహర్‌నగర్ ప్రారంభోత్సవం


మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెస్ క్లబ్ జవహర్ నగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వీడియో ఆవిష్కరణ కు ముఖ్య అతిధులుగా ప్రెస్ క్లబ్ కు విచ్చేసిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మ వారి చేతుల మీదుగా వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరపున వారిని గౌరవంగా సత్కరించారు అనంతరం మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ అమర్ నగర్ అభివృద్ధి కోసం మనమందరం పాటుపడాలని అభివృద్ధిలో మాతో పాటు మీరు సహకరించాలని జర్నలిస్టుల సంక్షేమం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ జవహర్ నగర్ పరిధిలో ఎన్నో సమస్యలు ఉ న్నాయని వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ నేడు కార్పొరేషన్ స్థాయికి వచ్చామని జవహర్ నగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మీ అందరి సహకారం కావాలని అందరం కలిసి ముందుకు వెల్ద మని తెలియజేశారు కమిషనర్ మంగమ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ స్థాయి నుండి కార్పొరేషన్ గా ఎదిగిన జవహర్నగర్ అభివృద్ధిలో కూడా అంతే దీటుగా ఎదగాలని దానికోసం మీ అందరి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ వీడియో చూసిన వీరందరూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్లతో పాటు కార్పొరేటర్ గొడుగు వేణు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేరు భాస్కర్ తెరాస నాయకులు కృష్ణ గౌడ్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.