వరదనీరు నిల్వలేకుండా పనులు... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 21, 2020

వరదనీరు నిల్వలేకుండా పనులు...


మణుగూరు ఆగస్టు 20 (శుభ తెలంగాణ): ఎడతెరిపి లేకుండ కొన్ని రోజులుగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలల్లో వున్న ఇండ్లలో, స్కూల్ లో నీళ్లు భారీగా చేరాయి. మణుగూరు మండలంలోని కూనవరం గ్రామంలో బుధవారం రాత్రి నుండి వర్షం కురిస్తుడంతో గురువారం స్థానిక సర్పంచ్ ఎనికే ప్రసాద్, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు కాల్వల పూడిక మట్టిని దగ్గర ఉండి జెసిబిల సహాయంతో తొలగించారు. రేగులగండి కెనాల్ ద్వారా కోడిపుంజుల వాగులోకి నీటిని మళ్లించారు. పజ్జ వారి గుంపు నందు సైడు కాల్వలు తీయించి నీటిని బయటకు పంపించారు. రైల్వే గేటు దగ్గర చెరువు పోటు వేయడంతో అలుగు పారి ఇండ్లలోకి నీరు చేరడంతో వారికి డైర్యం చెప్పడం, అలాగే పై గుంపులో ఉన్న ఎనికే గురవయ్య కుంట వరదతో నిండి... ప్రమాదం పొంచి ఉన్నదని ఇరిగేషన్ ఏఈకి సర్పంచ్ ప్రసాద్ చరవాణి ద్వారా ఇక్కడి పరిస్థితి వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ ఎనికే సమ్మయ్య, ఎలిబోయిన. సురేష్ , బత్తుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.