వినాయక మండపాలపై ఆంక్షలు తగదు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

వినాయక మండపాలపై ఆంక్షలు తగదు


భద్రాచలం ఆగస్ట్ 24(శుభ తెలంగాణ) వినాయక మండపాలకు అనుమతినివ్వాలని, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్థానిక నాయకులు వినాయక మండపాలు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని మండల తహసిల్దార్ కార్యాలయం నందు వినతిపత్రం అందించారు. వినాయక మండపాల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు చేయడం పై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నాయకులు మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం, హిందువుల ప్రాథమిక హక్కుల పై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వం ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్నారు. హిందువులు ఏ పండగ చేసుకో వాలో, ఏ పండగ చేసుకో వద్దే ప్రభుత్వాలు నిర్ణయించడం దుర్మార్గమని, ప్రభుత్వం ఆంక్షలు విధించడం రాష్ట్రానికి మంచిది కాదని వారు సూచించారు. కరోనా వ్యాధి ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల ఏర్పాటు విషయంలో భౌతిక దూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని, నియమ నిబంధనలు పాటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములీశెట్టి రామ్మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శులు సిహెచ్ వెంకన్న, అల్లాడి వెంకటేశ్వర రావు, పీసీ కేశవ, ఆవుల సుబ్బారావు, మారేవల్ల సుబ్బారావు, క్రాంతి బాబు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad