హెంమంత్రి అమితాకు.. మరోమారు అస్వస్థత - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 19, 2020

హెంమంత్రి అమితాకు.. మరోమారు అస్వస్థత


న్యూఢిల్లీ, ఆగస్ట్ 18 : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోమారు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఒంటి నొప్పులతో బాధపడు తుండగా మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. శ్వాసకోస సంబంధ సమస్యతో కూడా బాధపడుతున్నట్లు సమచారం. ఇటీవల కరోనా పాజిటివ్ గా పరీక్షించడంతో ఆయన గురుగ్రామ్ లో మేదాంత దవాఖానలో చికిత్స తీసుకున్నారు. ఈ నెల 2న ఆయన మేదాంతలో కరోనాతో చేరారు. తర వాత కరోనా నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా శ్వాసకోశ ఇబ్బందులు రావడంతో ఏయిమ్స్ లో చేరారు. ఆగస్టు 2న కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ధ్రువీ కరించారు. వైద్యుల సలహా మేరకు దవాఖానలో చేసి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 14న నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తాజాగా శ్వాసకోశ సమస్య లు ఎదురవడంతో ఏయిమ్స్ లో చేరారు. ఈ మేరకు ఏయిమ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మూడు నాలుగు రోజులుగా అమిత్ షా అలసట, ఒంటి నొప్పులతో బాధపడు తున్నారని హాస్పిటల్ చైర్ పర్సన్ డాక్టర్ ఆర్తి విజ్ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, హాస్పిటల్ నుంచే పనిని కొనసాగిస్తారని పేర్కొన్నారు. కాగా, అమిత్ షా సోమవారం ఓ ప్రైవేటు దవాఖానలో సిటీ స్కాన్ చేసుకోగా, పరీక్షా ఫలితాల్లో ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందని, దీంతో ఆయన వైద్యుల సలహా మేరకు ఏయిమ్స్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఛాతి నిపుణుడు, ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పరిశీలనలో షా ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. కేంద్రమంత్రి 24గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారని తెలిసింది.