పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం


పినపాక, ఆగస్టు 25(శుభ తెలంగాణ): ఇటీవల వచ్చిన వరదలకు పంట పొలాలు నీటమునిగి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని తహసిల్దార్ ఉమామ హేశ్వరరావు తెలిపారు. మంగళ వా రం తహసిల్దార్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలోని చాలా మంది రైతుల పొలాలు ముంపుకు, కోతకు గుర య్యాయని, వందల ఎకరాల పొలాలలో ఇసుక మేటలు పోసి పాడైపో య్యాయని, అటువంటి రైతులను ప్రభుత్వం అదుకుం టుదని ఆయన తెలియజేశారు. ముంపుకు గురైన పొలాలను రెవిన్యూ, వ్యవ సాయ అధికా రులు, ప్రజా ప్రతినిధులు కలిసి సర్వే చేయడం జరుగు తుందన్నారు. రైతులు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని లేదా సంబంధిత అధికారులకు తెలియపరచాలని ఆయన అన్నారు. ప్రతి రైతు నష్టపోకుండా వారికి న్యాయం చేస్తామని, సర్వేకి అధికారులు వచ్చినప్పుడు వారి వద్ద ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంకు ఎకౌంటు వచ్చిన అధికారులకు అందిం చాలని ఆయన కోరారు.

Post Top Ad