తెలంగాణ ఉద్యమకారుల.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

తెలంగాణ ఉద్యమకారుల.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి....


హైదరాబాద్ ఆగస్టు 24 (శుభ తెలంగాణ) : మల్కాజిగిరి ఎంపీ మరియు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ ఉ ద్యమకారుల ఫోరం కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ గౌరవ చైర్మన్ బి. ముత్తయ్య, చైర్మన్ డా. చీమ శ్రీనివాస్, కన్వీనర్ గొల్లపల్లి నాగరాజు, వైస్ చైర్మన్ పి.సురేందర్ రెడ్డి, జంగ సుదర్శన్ కో కన్వీనర్ ఎం. రాంబాబులు కలిసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేయాలని అలాగే కోవిడ్ -19 కాలంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యమ కారులకు నెలకు రూ.5000/- చొప్పున ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేయాలని వినతిపత్రంలో వారు కోరినారు. ఉ ద్యమకారుల కోరికలు న్యాయమైనవి మీ డిమాండ్లు నెరవేర్చడానికి మా పార్టీలో చర్చిస్తామన్నారు. పార్లమెంటులో కూడా ఉద్యమకారుల సంక్షేమం కోసం గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉ ద్యమకారుల సంక్షేమ బోర్డు కోసం ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తెస్తానని అన్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ఒచ్చే ఎన్నికల్లో మా మ్యానిఫెస్టోలో కూడా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు అంశాన్ని చేరుస్తామని చెప్పారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న టి యు ఎఫ్ సభ్యులందరినీ అభినందించారు.