జెండాపై కపిరాజుతో.. అయోద్య ఘట్టానికి సంఘీభావం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 06, 2020

జెండాపై కపిరాజుతో.. అయోద్య ఘట్టానికి సంఘీభావం..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (శుభ తెలంగాణ) చర్ల మండలం కోట్లాది భారతీయుల చిరకాల కోరికకు రూపం పోస్తూ బుధవారం మధ్యానం 12 గంటల 40 నిమిషాలకు ఆయోధ్యలో రామమందిరం భూమి పూజ మరియు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా చర్ల బిజెపి సీనియర్ నాయకులు రావులపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో చర్ల నడిబొడ్డున గల హనుమాన్ విగ్రహం దగ్గర పూజలు నిర్వహించారు. తర్వాత విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో పురవీధులలో హనుమాన్ జెండాలు కట్టారు. ఈ కార్యక్రమంలో మండల సూజీ అధ్యక్షులు పాసి కంటి సంతోష్, ప్రధాన కార్యదర్శి మచ్చ రఘు మరియు సీనియర్ నాయకులు ఎస్ లోకనాథం గారు, రత్తయ్య గారు, ఎస్ వీర రాఘవులు, డాక్టర్. బి వెంకటేశ్వర్లు గారు, తదితరులు పాల్గొన్నారు.