గాంధీ ఆస్పత్రి నుంచి.. నలుగురు ఖైదీల జంప్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

గాంధీ ఆస్పత్రి నుంచి.. నలుగురు ఖైదీల జంప్
హైదరాబాద్, ఆగస్టు 27(శుభ తెలంగాణ): కరోనా చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పోలీసలు కళ్లు గప్పి గాంధీ దవాఖాన నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగం లోకి దిగి గాలింపు చేపట్టారు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ దవా ఖానకు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. వారికి దవాఖాన లోని మొదటి అంతస్తులో ఉన్న ఖైదీల వార్డులో చికిత్స అందిస్తు న్నారు. అయితే బాత్ రూమ్ అని చెప్పిన వెళ్లిన ఆ నలుగురు ఖైదీలు బుధవారం అర్ధరాత్రి దవాఖాన నుంచి పారిపోయారు. కిటికీ గ్రిల్ తొలగించి పారిపోయారని అంటున్నారు. దీంతో ఆస్పత్రి సమీపంలో సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారికోసం దవాఖాన పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నా రు. గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దవాఖాన నుంచి తప్పించుకున్న ఖైదీని పోలీసులు రెండు రోజుల్లోనే పట్టుకున్నారు. గాంధీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురు ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డు నుంచి కోవిడ్తో చికిత్స పొందుతున్న నలుగురు జైలు ఖైదీలు ఎస్కార్ట్ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు పరారీ అయ్యారని సమాచారం. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి పారిపోయారు. వీరిలో ఇద్దరు చంచల్ గూడ రిమాండ్లో ఉన్న ఖైదీలు ఉన్నారు. మరొకరు చర్లపల్లి జైలులో శిక్ష ఖరారైన ఖైదీ కాగా ఇంకొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరారైన ఖైదీ. పరారిలో ఉన్న వారిలో అబ్దుల్ రబాజా రాజేంద్రనగర్ లో కేసులో నిందితుడు, ఎండి తాండూరు కేసులో నిందితుడు. సుందర్,నర్సింహా శిక్ష ఖరారైన ఖైదీలు. ఇక ఈ నలుగురు ఖైదీలు ఆస్పత్రి నుంచి పరారయిన వారిపై చిలకగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ లోనే ఇతర వార్డుల్లో నక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాంధీ హాస్పిటల్లో గాలింపు చర్యలు చేపట్టారు.