కుండపోత వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన రోడ్డుని.. వెంటనే మరమ్మతులు చేయాలి:బిజెపి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 19, 2020

కుండపోత వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన రోడ్డుని.. వెంటనే మరమ్మతులు చేయాలి:బిజెపి


హైదరాబాద్ (శుభ తెలంగాణ) : తార్నాక డివిజన్ బిజెపి అధ్యక్షులు రాము వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాము వర్మ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో కుండపోత వర్షాన్ని కి రోడ్లన్నీ కంకరతేలి గుంతలతో దీనికితోడు డ్రైనేజీ నీరు పొంగి పొర్లు తున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోడ్ల పై మురుగు నీరు నిలవడంతో క్రిమికీటకాలు వ్యాపించి తద్వారా కరోనా వైరస్ మరియు ఇతర వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక. ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బులు కట్టలేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు విశ్వనాథ్ ముదిరాజ్, గంగరాజు శ్రీనివాస్, సతీష్ రెడ్డి, గోవర్ధన్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ చారి, అమిత్ర, ప్రభాకర్, అయ్యప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.