కరోనా కట్టడి చర్యల్లో అలసత్వంపై... హైకోర్టు ఆగ్రహం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

కరోనా కట్టడి చర్యల్లో అలసత్వంపై... హైకోర్టు ఆగ్రహం


హైదరాబాద్, ఆగస్ట్ 13(శుభ తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. సీఎస్ సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా పై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించింది. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎసను ఉద్దేశించి న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటివరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్ కుమార్ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 50 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చి కేవలం రెండు ఆస్పత్రులపై చర్యలకు పూనుకోవడం లో ఆంతర్యమేమిటని కూడా ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రులను ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు. అయితే కరోనా వైరస్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ హై కోర్టుకు తెలిపారు. కరోనా టెస్టులు, చికిత్సలపై హై కోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు జరుపుతున్న తీరు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తోన్న చికిత్స గురించి ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పించామని తెలిపారు. ఆగస్టు 3 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 42 వేల మంది సెంకడరీ కాంటాక్టు లకు కరోనా టెస్టులు చేశామని, రాపిడ్ టెస్టులు ఎంతో ఉపయోగ పడుతున్నాయని... రోజుకు 40 వేల టెస్టులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 46 ప్రయివేట్ ఆస్పత్రులకు నోటీసులకు ఇచ్చామన్నారు.