జలకళను సంతరించుకున్న తాలిపేరు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

జలకళను సంతరించుకున్న తాలిపేరు..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 13 ఆగస్టు (శుభ తెలంగాణ): నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు భారీగా చేరుతుండటంతో చర్ల మండల పరిధిలోని తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుండి సైతం వరదపోటు వస్తుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించు కుంది. వరదపొంగుతో అప్రమత్తం అయిన ప్రాజెక్టు అధికారులు. గురువారం 14 గేట్లు 6 అడుగుల వరకు మరియు 5 పూర్తిగా ఎత్తి 75547 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 0.73 టీఎంసీ సామర్ధ్యం గల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 72.48 మీటర్లు ఉ ండగా, ఎగువ ప్రాంతం నుండి వరదనీరు భారీగా చేరుతుండటంతో అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.