మధ్యాహ్న భోజన పథక.. బియ్యం పురుగుల మయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

మధ్యాహ్న భోజన పథక.. బియ్యం పురుగుల మయం..


బూర్గంపాడు ఆగస్టు 25 (శుభ తెలంగాణ): కోవిద్ 19 కరోనా వైరస్ కారణంగా మార్చి నెల 22 నుండి దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో అప్పటి వరకు యధావిధిగా కొనసాగిన పరిశ్రమలు, సంస్థలు అకస్మాత్తుగా మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కోసం వందల క్వింటాల బియ్యం స్కూళ్లకు చేరాయి. లాక్ డౌన్ ముందు రోజు వరకు తరగతులు నిర్వహించి, తరగతి గదులకు తాళాలు పడదంతో నాటి నుండి నేటి వరకు దిగుమతి అయిన బియ్యం స్టోర్ రూములో పురుగులు పట్టి పాడై పోతున్నాయి. అలా పురుగులు పట్టిన బియ్యాన్ని కొంత కాలం క్రితం అధికారులు స్కూల్లో పనిచేసే వర్కర్ల చేత శుభ్రపరిచి మళ్ళీ భద్ర పరిచారు, కానీ మరల నేడు ఆ బియ్యం పురుగులు పట్టి పాడైపోయే దశలో ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని మళ్ళీ శుభ్రపరిచే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బడులు ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేదు. విద్యార్థులు తరగతి గదుల్లో ఎప్పుడు కూర్చుంటారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆ బియ్యాన్ని ఇంకా అలాగే ఉంచితే ఎందుకు పనికి రాకుండా పాడైపోయే అవకాశం ఉ ంది. కావునా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి,స్కూల్ స్టోర్ రూంల్లో పాడైపోతున్న వందల క్వింటాల బియ్యాన్ని వరద బాధితులకు పంచి పెడితే కనీసం వారి ఆకలి తీర్చిన వారవుతారు. కావునా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో పాడైపోతున్న బియ్యాన్ని ప్రజలకు అందే విదంగా చొరవ తీసుకోవాలని బూర్గంపాడు మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Post Top Ad