అధికారుల నిర్లక్ష్యం వల్లనే.. ఇండ్లలోకి మురుగునీరు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

అధికారుల నిర్లక్ష్యం వల్లనే.. ఇండ్లలోకి మురుగునీరు..


భద్రాచలం, ఆగస్టు 12 (శుభ తెలంగాణ) : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం పట్టణంలో పలు కాలనీలలోకి మురుగు నీరు చేరి ఇండ్లను ముంచె త్తాయని సిపిఐ పట్టణ కార్యదర్శి ఆరోజు సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని పలు కాలనీ లో డ్రైనేజీ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉండటంతో పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోకుండా ఉండడంతో బుధవారం ఇండ్లలోకి వరద నీరు రావడం జరిగిందని, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమేనని ఆయన అన్నారు. భద్రాచలం దేవస్థానం భూముల్లో ఉన్న చెరువులో భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు కాలనీ అయిన జగదీష్ కాలనీ పలు ఇండ్లలోకి నీరువచ్చి మునిగిపోవడం జరిగిందన్నారు. అసలే వర్షాలతో, కరోనా వ్యాధి వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు ముందస్తు జాగ్రత్తగా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయకపోవడంతో కాలనీలో దుస్థితి మరింత అధ్వాన్నంగా తయారైందన్నారు. తక్షణమే నీటమునిగిన ఇండ్ల బాధితులకు ప్రభుత్వం సహాయం సహకారాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సిపిఐ నాయకులు గుంజా వెంకన్న. గాడిద భాస్కర్ రావు బత్తుల నరసింహులు, శ్రీ రాములు, గడ్డం నాగమ్మ తదితరులు పాల్గొన్నారు