మేడ్చల్ జిల్లా పార్టీ భవనాన్ని.. పరిశీలించిన చీఫ్ విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 15, 2020

మేడ్చల్ జిల్లా పార్టీ భవనాన్ని.. పరిశీలించిన చీఫ్ విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే...


కుత్బుల్లాపూర్ 14 ఆగస్టు (శుభ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మ వద్ద నూతనంగా నిర్మిస్తున్న మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్, తెరాస ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాను సారం ఈరోజు రావడం జరిగిందని, ఎకరం స్థలంలో విషాలవంతమైన కార్యాలయం, సమావేశ మందిరం, విశ్రాంతి గదులు, వంటశాలతో పాటు సరిపడా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తూ సకల హంగులతో పార్టీ కార్యాలయాన్ని సొంత ఇంటి లాగ చక్కదిద్దుతున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల కృషి అభినందనీయం అన్నారు. ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీ భవన్ త్వరలోనే అందుబాటులోకి రానున్నదని తద్వారా కార్యకర్తల్లో నూతనోత్సాహం కలిగి పార్టీ రానున్న రోజుల్లో మరింత విజయవంతంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.