మంత్రి మల్లారెడ్డికి కరోనా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 09, 2020

మంత్రి మల్లారెడ్డికి కరోనా


మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మల్లా రెడ్డికి కరోనా సోకడంతో ఇటీవల కాలంలో ఆయన కలిసినవారిలో ఆందోళన నెలకొంది. అయితే ఆయన ఆరోగ్యంపై బంధువులు, అభి మానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందుతుండటంతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. 'గత ఆదివారంనాడు కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. అలాగే ఎలాంటి సింటమ్స్ నాకు లేవు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కరోనాకు మెడిసిన్తో పాటు ధైర్యంగా ఉంటే పూర్తిగా కోలుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉ ండాలి' అని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ కేబినెట్ ను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం తెలిసిందే.