బొగ్గు ఉత్పత్తికి అంతరాయం లేకుండా చూడాలి : జియం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 20, 2020

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం లేకుండా చూడాలి : జియం


మణుగూరు, 19 ఆగస్టు (శుభ తెలంగాణ): మణుగూరు ఏరియా లోని ఓసిని బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ సందర్శించారు. ఓసి వ్యూ పాయింటు నుంచి క్వారీని, కోల్ బెంచ్, డంపింగ్ యార్డ్ రూట్లను పరిశీలించారు. అనంతరం ఓసి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ క్వారీ లోని పలు ప్రదేశాల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగేందుకు సత్వర చర్యలు చేపట్టాలని జియం సూచించారు. గత 12 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, వెనకబడిన వార్షిక లక్ష్యాలను సాధించడానికి ముందస్తు ప్రణాళికతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణాకు ఎటువంటి ఆంతరాయం ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో సింగరేణి అధికారులు వెంకటేశ్వర్లు, లలిత్ కుమార్, నరసింహ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.