ఇండ్లు కూలిపోయిన వారికి.. ఎమ్మెల్యే ఆర్థిక సహాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

ఇండ్లు కూలిపోయిన వారికి.. ఎమ్మెల్యే ఆర్థిక సహాయం


భద్రాచలం. ఆగస్టు 27. (శుభ తెలంగాణ) : స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య చేతుల మీద ఇటీవల అధిక వర్షపాతం కారణంగా ఇల్లు కోల్పోయిన ఐదు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి మంజూరైన మైనర్ రిపేరుకు మూడువేల ఆరువందల రూపాయలు, మేజర్ రిపేరుకు నాలుగు వేల ఒక వంద రూపాయలు నగదు రూపంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పొదెం వీరయ్య అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం తహాసిల్దారు నాగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.