నిత్యావసర సరుకులను పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

నిత్యావసర సరుకులను పంపిణీ...


బూర్గంపాడు, ఆగస్టు 08 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో సోమవారం భద్రాచలం ఐటీసి - పీఎస్ పిడి వారి ఆధ్వర్యంలో 1500 వందల మంది ఆదివాసీ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ముసలి మడుగు, వేపాలగడ్డ, మొరంపల్లి బంజర్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు కరోనా మహమ్మారి వలన ఇండ్లకే పరిమితమైన ఆదివాసీ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత చేతుమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీసి పీఎస్ పిడి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెంగల్ రావు స్థానిక సర్పంచులు కుర్సం వెంకటరమణ, కుంజా చిన్నభాయ్, భూక్య దివ్యశ్రీ, మాజీ జడ్పీటీసీ బట్ట విజయ్ గాంధి, ఉపసర్పంచులు వర్స వెంకటేశ్వర్లు, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి గారు, కైపు ఖగేందర్ రెడ్డి,వార్డ్ సభ్యులు పాలం దివాకర్ రెడ్డి, తాటి శ్రీనివాస్ ,మాజీ ఉపసర్పంచ్ మడకం శ్రీసు ,తెరాస నాయకులు పోడియం నరేందర్, కుర్సం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.