ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ అమలుచేస్తున్న ఒకేరాష్ట్రం తెలంగాణ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 10, 2020

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ అమలుచేస్తున్న ఒకేరాష్ట్రం తెలంగాణ

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రశంసించింది. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నది. రాష్ర్టాల్లోని కనీసం 20 శాతం గ్రామపంచాయతీల్లో ఈ-ఆడిటింగ్‌ చేపట్టాలని కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. 15వ ఆర్థికసంఘం ప్రతిపాదించిన నిధులను పంచాయతీల అకౌంట్లలో జమచేయాలంటే ఈ-ఆడిట్‌ను అమలు చేయాల్సిందేనని నిబంధన పెట్టింది. ఈ నెల 3 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. అయితే తెలంగాణ మాత్రమే ఈ-ఆడిట్‌ను మొదలుపెట్టింది. ఇతర రాష్ర్టాలు ఈ-ఆడిట్‌ను చేపట్టకపోవడంపై కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అసంతృప్తి వ్యక్తంచేసింది. 
ఈ నెల 13న అన్నిరాష్ర్టాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయిస్తూ.. లేఖలు రాసింది. ఈ-ఆడిట్‌లో తెలంగాణ అందరికన్నా ముందున్నదని లేఖలో ప్రశంసించిన కేంద్రం.. 13న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ-ఆడిట్‌ అమలు తీరుతెన్నులను వివరించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ తరఫున ‘లోకల్‌ ఫండ్‌ ఆడిటింగ్‌' విభాగం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నది. ఈ సమావేశానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్‌ సేథి అధ్యక్షత వహిస్తారు.