పిసిసి చీఫ్ మార్పు.. ఇప్పట్లో లేనట్లే! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

పిసిసి చీఫ్ మార్పు.. ఇప్పట్లో లేనట్లే!


హైదరాబాద్, ఆగస్టు 27(శుభ తెలంగాణ); కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా కార్యక్రమాలు సాగిస్తున్నారు. అలాగే ఒకరిపై ఒకరికి పడదని ముందునుంచి అందరికి తెలిసందే. దీనికితోడు పిసిసి అద్యక్షుడు ఉత్తమ్ అంటే గిట్టని వారే పార్టీలో ఎక్కువగా ఉన్నారు. ఈ పదవిపై ఆశ ప ఎట్టుకున్న వారు గతేడాదిగా చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అయితే ఎఐసిసి పరిణామాల నేపథ్యంలో మరో ఆరు నెలల వరకు పిసిసి మార్పు ఉండదన్న సంకేతాలు వస్తున్నాయి. ఉత్తమ్ స్థానంలో తామే రైట్ అంటూ చాలామంది గతంలో ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. తాజాగా కరోనా నేపథ్యంలో కాంగ్రెస్ పోరాడుతు న్నా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేంతగా ఫలితాలు రాబట్టలేకపోతున్నారు. కేవలం కాంగ్రెస్ విమర్శలకే పరిమితం కావడంతో అనేక కార్యక్రమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇవన్నీ నాయకత్వ సమస్యగా పార్టీ నేతలు చూపిస్తు న్నారు. మొత్తంగా ఇటీవలి ఢిల్లీ పరిణామాల నేప థ్యంలో పిసిసి చీఫ్ మారడం అన్నది ఇప్పట్లో జరగ దని తెలుస్తోంది. ఎఐసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగే వరకు ఉత్తమ్ కొనసాగుతారిన పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో తెలంగాణ పిసిసి చీఫ్ మార్పు ముహూర్తం కుదరడం లేదని కూడా వ్యా ఖ్యానిస్తు న్నారు. దీంతో ఆశావహులకు నిరాశే ఎదురౌతోంది. ఏడాది కాలంగా తెలంగాణ కాంగ్రి అధ్యక్షుడి మార్పు ఖాయమనే ప్రచారం నడుస్తు న్నా... ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారనుకుంటే... అదీ జరగలేదు అధ్యక్ష బాధ్యతల్ని రాహుల్ గాంధీ చేపడతారని... వెంటనే టీ-పీసీసీకి కొత్త నాయకుడ్ని నియమిస్తార ని ఓ వర్గం భావించింది. కానీ... వర్కింగ్ కమిటీ సమావేశంలో గందరగోళంతో అధ్యక్ష పదవిలో మరో ఆరు నెలల పాటు కొనసా గేందుకు సోనియా గాంధీ అంగీకరించడంతో తెలంగాణ పిసిసి కూడా వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చాలా కాలంగా కొనసాగుతున్నాం కనుక అధినాయకత్వం చేస్తే... కీలక పదవులు తమకేనంటూ చెప్పుకున్నారు కొందరు నేతలు. మరో ఆరు నెలల పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగే అవకాశాలన్నాయన చర్చ జరుగుతోంది. మరోవైపు... గ్రేటర్ హైదరాబాద్ తో పాటు... ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు మార్పులు, చేర్పులు ఉ ండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగినంత కాలం... ఉత్తమ్ కి డోకా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే... ఈ త్తమ్ వ్యతిరేక శిబిరం మాత్రం... ఇప్పటికీ మార్పుపై ఆశలు వదులుకోడానికి సిద్ధంగా లేదు. తెలంగాణలో ప్రభుత్వంపై పోరాడేందుకు గట్టి నాయకుడు అవసరం అన్న భావనలో పలువురు ఉన్నారు.